4 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

4 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

ASF: పెంచికల్ పేట్ మండలంలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా అవుతున్నాయనే పక్కా సమాచారం మేరకు గురువారం టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. 2 వాహనాలలో 4గురు వ్యక్తులు 4 క్వింటాళ్ళ ప్రభుత్వ నిషేధిత నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని టాస్క్ ఫోర్స్ CI రాణా ప్రతాప్ తెలిపారు. నేరస్తులను, వాహనాలను పోలీస్ స్టేషన్‌లో అప్పగించామన్నారు.