'వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చు'
PDPL: వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డా. ఉమా శ్రీ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం జన్నారం ఆసుపత్రి ఆవరణలో వైద్యులు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. మంచి అలవాట్లు ప్రతి ఒక్కరికి మేలు చేస్తాయన్నారు. వ్యాధిగ్రస్తులు మందులను వాడాలన్నారు.