జైనూర్ వ్యక్తికి రాష్ట్ర స్థాయి గౌరవం
ASF: జిల్లా జైనూర్‌కు చెందిన మవాలే దత్త మాంగ్‌కు దళిత రత్న అవార్డు లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా నలుగురికి ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.