'సర్పంచ్ అభ్యర్థులుగా యువతకు అధిక ప్రాధాన్యం'
WGL: నర్సంపేట నియోజకవర్గంలోని 172 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థులుగా యువతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. ఇవాళ బీజేవైఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యువకులే దేశానికి వెన్నెముక అని, యువత ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.