ఉంగుటూరులో నామినేషన్ స్వీకరణ ఏర్పాట్లు పూర్తి

ఉంగుటూరులో నామినేషన్ స్వీకరణ ఏర్పాట్లు పూర్తి

ప.గో: ఎన్నికలకు సంబంధించి ఈనెల 18 నుంచి నామినేషన్లు స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉంగుటూరు ఆర్వో ఎన్.ఎస్.కే. ఖాజావలి పేర్కొన్నారు. నియోజకవర్గంలో 2,05,334 మంది ఓటర్లు ఉన్నారు. 214 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు తీసుకునేందుకు పగడ్బందీ ఏర్పాట్లు ఉంగుటూరు తహశీల్దారు కార్యాలయంలో సిద్ధం చేశామన్నారు.