ముగిసిన ఆరోగ్య శ్రేయస్సు వారోత్సవాలు

ముగిసిన ఆరోగ్య శ్రేయస్సు వారోత్సవాలు

NRML: బాసర ఆర్జీయూకేటీ కళాశాలలో మానసిక స్వస్థత కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య శ్రేయస్సు వారోత్సవాలు ముగిశాయి. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. మేధోపరమైన, ఉద్వేగభరితమైన శక్తులను తెలుసుకొని సమాజానికి ఉపయోగపడాలని ఆయన కోరారు.