'పిల్లలను జింక్ ఫుడ్స్‌కు దూరంగా ఉంచాలి'
AKP: పిల్లలకు అనారోగ్యాన్ని కలిగించే జింక్ ఫుడ్స్ ఇవ్వవద్దని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రమణి సూచించారు. పోషణ్ పక్వాడపై పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అందుబాటులో ఉండే కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలతో పిల్లలకు ఆహార పదార్థాలు చేసి పెట్టాలన్నారు. అలాగే గర్భిణీల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.