ఆర్టీసీ కార్గోలో పోలీసుల విస్తృత తనిఖీలు
KNR: ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన దృష్ట్యా, నగర ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలలో భాగంగా వన్ టౌన్ పోలీసులు గురువారం రాత్రి కరీంనగర్ బస్టాండ్ ఆర్టీసీ కార్గోలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో కార్గోలోని పార్శిళ్లు, అనుమానాస్పద వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీలు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచాయి.