బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు

నల్గొండ: బాలికను వేధిస్తున్న యువకుడిపై ఆత్మకూర్ పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ శివశంకర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక సూర్యాపేట పాఠశాలలో చదువుతుంది. SRPTకి చెందిన మట్టపల్లి ఉదయ్ ఏడాదిగా బాలికను వేధిస్తున్నాడు. బాలిక కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించిన ప్రవర్తన మార్చుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.