భూ వివాదంలో కుటుంబంపై దాడి

భూ వివాదంలో కుటుంబంపై దాడి

WGL: :భూ వివాదంలో కుటుంబంపై దాడి చేసిన ఘటన శనివారం పర్వతగిరి మండలం జగ్గు తండాలో జరిగింది. బాధితుడు బానోతు భద్రు తెలిపిన వివరాల ప్రకారం.. తన వ్యవసాయ భూమిలో సాగు పనులు చేస్తుండగా పక్క భూమికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు కారణం లేకుండా గొడవపడి తనతో పాటు తండ్రి పాండు, భార్య సుశీలపై దాడి చేశారన్నాడు. దాడిలో తన తండ్రికి కాలు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు