'గీత కార్మికులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి'
MHBD: తొర్రూరు ఎక్సైజ్ ఎస్సై శంకర్ ఆధ్వర్యంలో బుధవారం పెద్దవంగర మండలంలోని గంట్లకుంట గ్రామంలో గీత కార్మికులకు గుర్తింపు కార్డుల కోసం టెస్టులు నిర్వహించారు. గుర్తింపు కార్డుల ద్వారానే గీత కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, 50 ఏళ్లు నిండిన గీత కార్మికులకు పెన్షన్లు వస్తాయని అన్నారు. ప్రతి గీత కార్మికుడికి గుర్తింపు కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు.