చిక్కుకున్న వారిని తీసుకొస్తున్నాం: కేంద్రం
పశ్చిమాసియాలో చిక్కుకున్న వారిని తీసుకువస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. భారత పౌరుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. ఇవాళ ఒక్కరోజే పలుచోట్ల నుంచి 50 విమానాలు నడుపుతున్నట్లు పేర్కొంది. దుబాయ్, అబుదాబి, మస్కట్, జెడ్డా నుంచి విమానాలు సురక్షితంగా వచ్చాయని చెప్పింది. గత రెండు రోజుల్లో 100 విమానాల ద్వారా ప్రయాణికులను తరలించినట్లు వివరించింది.