తాంసిలో క్షుద్ర పూజల కలకం

ADB: తాంసి మండలంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. మండలంలోని కప్పర్లకు చెందిన దారట్ల అశోక్ శుక్రవారం రాఖీ పండగ నేపథ్యంలో వేరే గ్రామానికి వెళ్లారు. శనివారం (పౌర్ణమి) రోజున ఇంటి వద్ద ఎవరు లేకపోవడంతో వారి బాత్రూంలో నిమ్మకాయాలు, చిన్న బొమ్మతో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ఆదివారం ఇంటికి చేరుకున్న కుటుంబీకులు వచ్చి చూడగా వీటిని గమనించారు.