అయోధ్యపురం రైల్వే గేట్ వద్ద దొంగ అరెస్ట్
HNK: కాజీపేట మండలం అయోధ్యపురం రైల్వే గేట్ వద్ద శుక్రవారం తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఐలవేని సాయి రోహిత్ (26)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు ఆరు నెలల క్రితం తన బావ బూతగడ్డ సతీష్ ఇంటిలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి 47.5 గ్రాముల బంగారం (₹4,36,066 విలువ) స్వాధీనం చేసినట్లు మడికొండ ఇన్‌స్పెక్టర్ కిషన్ తెలిపారు.