పికిల్ బాల్ చాంపియన్ షిప్ విజేతగా మాజీ మంత్రి

VZM: గత రెండు రోజులుగా విజయవాడలో జరుగుతున్న పికిల్ బాల్ ఛాంపియన్ షిప్-2025లో సోమవారం విజేతగా మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు నిలిచారు. ఈ మేరకు పురుషుల డబుల్స్ విభాగంలో విశాఖకు చెందిన అనంత్‌తో కలిసి ఆడి విజయవాడకు చెందిన రోహిత్, చరణ్ జోడిపై విజయం సాధించి బంగారు పతకం సాధించారు. 50 ఏళ్లు పైబడిన విభాగంలోప్రథమ స్లానంలో నిలిచి గోల్ మెడల్ సాధించారు.