అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన చమర్తి
KDP: అన్నా క్యాంటీన్ నందు పేదల కోసం అందించే ఆహారం నాణ్యతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, రుచిగా ఉండాలని రాజంపేట TDP ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. బుధవారం రాజంపేట పట్టణం R&B అతిథి గృహం వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ.. పేదల కోసం ప్రభుత్వం రూ.5లకే అల్పాహారం, భోజన సదుపాయం కల్పిస్తుందన్నారు.