పరిశ్రమల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
KRNL: జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల స్థాపన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఏ.సిరి సూచించారు. మంగళవారం పరిశ్రమల పురోగతిపై యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనుల స్థితిగతులను ఆరా తీసిన కలెక్టర్.. ఎదురయ్యే సమస్యలను వెంటనే తెలియజేయాలని చెప్పారు. అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని, పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.