వడదెబ్బతో కూలీ మృతి

వడదెబ్బతో కూలీ మృతి

ADB: నార్నూర్ మండలం తాడిహత్నూర్ ఎస్సీ కాలనీకి చెందిన కల్వలె విజయ్ (38) వడదెబ్బతో మృతి చెందారు. వారం క్రితం పత్తి లోడింగ్ పనుల కోసం వాంకిడి మండలానికి వెళ్లిన ఆయన, అక్కడ ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు వదిలారు. విజయ్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.