లంక గ్రామాలలో మొసళ్ల భయం

లంక గ్రామాలలో మొసళ్ల భయం

కోనసీమ: అయినవిల్లి మండలానికి మొసళ్ళు భయం పట్టుకుంది. గత రెండు రోజుల నుంచి లంక గ్రామాలలో ఉన్న గుంతల్లో మొసళ్ళు ప్రత్యక్షమవ్వడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక రైతులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు శనివారం వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మొసళ్ళను సురక్షితంగా పట్టుకుని వన సంరక్షణ కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.