ఎన్‌కౌంటర్.. సైన్యం చేతిలో ఉగ్రవాది హతం
జమ్మూకశ్మీర్‌లోని గందర్బల్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అర్హామా అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు, సైన్యం, CRPF బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగగా, బలగాలు ధీటుగా బదులిచ్చాయి. ఓ ఉగ్రవాది మరణించగా, ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నాయి.