పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

ELR: సరస్వతి నది పుష్కరాలకు భీమవరం నుంచి బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి మంగళవారం తెలిపారు. ఈనెల 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలకు ప్రత్యేక స్పెషల్ సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు. భీమవరం కొత్త బస్టాండ్ నుంచి బస్సులు బయలుదేరుతాయన్నారు.