ప్రగతి ధర్మారం - నర్లాపూర్ రహదారి అస్తవ్యస్తం.

ప్రగతి ధర్మారం - నర్లాపూర్ రహదారి అస్తవ్యస్తం.

MDK: మండలంలోని ప్రగతి ధర్మారం నుండి నర్లాపూర్ వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతిని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగు పనుల నిమిత్తం కల్టివేటర్ ట్రాక్టర్లు రోడ్డుపై వెళ్లడంతో తారు పొర లేచిపోయి రోడ్డు బీటలు వారింది. దీంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.