పింఛన్ల విషయంలో కోత పెట్టారు: హరీష్ రావు
HYD: బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి 12.1% ఉండగా, కాంగ్రెస్ పాలనలో అది 10.2%కి పడిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్ర ఆర్థిక ప్రగతి మందగించిందని, పింఛన్ల విషయంలోనూ ప్రభుత్వం కోత విధిస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల ప్రజల ఆదాయం తగ్గిందని, సంక్షేమ పథకాలకు ఆటంకం కలుగుతోందని ఆయన మండిపడ్డారు.