అత్యంత ప్రమాదకరమైన 'బ్యాండెడ్ క్రైట్' పాము

MLG: మంగపేటలో ఓ అరుదైన పాము దర్శనమిచ్చింది. వర్షాల నేపథ్యంలో వరదలో బ్యాండెడ్ కైట్ (బంగారస్ ఫాసియాటస్) అనే జాతికి చెందిన పాము రాగా స్థానికులు ఆత్మరక్షణకు దానిని హతమార్చారు. చైనా, ఆసియా దేశాల్లో ఉండే అత్యంత విషపూరితమైన జాతుల్లో ఇది ఒకటి. పాము పొడవు 2 మీటర్ల కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఇది ప్రత్యేకమైన బంగారం, నలుపు గుర్తులతో ఉంటుంది.