మంగళ గౌరీ దేవికి ప్రత్యేక పూజలు

మంగళ గౌరీ దేవికి ప్రత్యేక పూజలు

KDP: సిద్దవటం మండలం మాధవరం గ్రామంలో వెలసిన శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వరుని ఆలయంలో ఇవాళ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు జింకా సాంబయ్య అమ్మవారికి జలాభిషేకం, కుంకుమార్చన అభిషేకాలను నిర్వహించి పూలతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు.