జన్నారంలో బీసీ సంఘం నాయకుల ధర్నా
MNCL: జన్నారం మండల కేంద్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. సోమవారం ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. బీసీలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరారు.