రూ.10 లక్షలతో స్మశాన మండపం ఏర్పాటు

కడప: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలో హిందూ స్మశాన వాటికలో దాతలు నిర్మించిన స్మశాన వాటిక మండపాన్ని ఆదివారం గ్రామ సర్పంచ్ అవ్వారు జానకిరామయ్య ప్రారంభించారు. ఉప్పల వెంకటేష్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబసభ్యులు బాబు మోహన్ కుమార్ రూ.10లక్షల వ్యయంతో మండపాన్ని నిర్మించారు. అనంతరం ఆవరణలో మొక్కలను నాటారు.