మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జరిమానా

మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జరిమానా

VSP: ఆనందపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం త్రాగి వాహనాలు నడిపిన 30 మందికి భీమిలి న్యాయస్థానంలో అపారాధ రుసుము విధించారు. భీమిలి కోర్ట్ ఏస్‌వి అడిషనల్ మెట్రో పోలీటన్ మేజిస్ట్రేట్ స్వాతి భవాని ఎదుట మంగళవారం హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 30 కేసులకు గాను ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున మొత్తము 3,00,000 రూపాయలు అపరాధ రుసుము విధించారు.