శ్రీవారి కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు

శ్రీవారి కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు

ELR: ద్వారకాతిరుమల శ్రీవారి వైశాఖ మాస తిరుకళ్యాణ మహోత్సవాలకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 3 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఆలయానికి, ప్రాకారాలకు రంగులు వేసి మెరుగులు దిద్దారు. విద్యుద్దీపాలంకరణలు చేశారు. ఉత్సవాలు ప్రారంభానికి ఒక రోజు ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు.