గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను సద్వినియోగం చేసుకోవాలి

జాజిరెడ్డిగూడెం: గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను పశువుల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీ నర్సయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఉయ్యాలవాడ గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణకు ఉచిత టీకాలు ప్రారంభించి మాట్లాడారు. నివారణ టీకాలతో పశువులు ఆరోగ్యవంతంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో కేవీవీ పద్మ, వీఎల్ఓ యాదగిరి, ప్రజలు పాల్గొన్నారు.