సీఎం సహాయనిధి చెక్‌ను అందించిన ప్రభుత్వ విప్

అన్నమయ్య: ఆపదలో ఉన్న వారికి అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించే సహాయాన్ని ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ మంగళవారం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చిన 50 వేల రూపాయల చెక్‌ను చిట్వేలు మండలం మైలపల్లికి చెందిన చెవ్వు వెంకటరెడ్డి కుటుంబానికి అందించారు. గ్రామంలో పర్యటించి అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.