ఘనంగా గణతంత్ర వేడుకలు
NLG: నకిరేకల్ పట్టణ కేంద్రంలో బిజెపి నాయకులు 77వ గణతంత్ర దినోత్సవన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వనం వేణు ఆధ్వర్యంలో జిల్లా ఓబీసీ కార్యదర్శి వంగూరు సైదులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణ ఉపాధ్యక్షుడు మైల శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది పాలనలో దేశ ప్రజలు సుభిక్షంగా ఉన్నారని కొనియాడారు.