సూర్యలంక బీచ్‌లో క్లీన్ అండ్ గ్రీన్

బాపట్ల: సూర్యలంక బీచ్ వద్ద శనివారం మెరైన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టారు. మెరైన్ సీఐ నేతృత్వంలో సిబ్బంది బీచ్, స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రం చేశారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. శుభ్రత, పచ్చదనం పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించారు.