ఆగస్టు 23న స్వచ్ఛంధ్ర దినోత్సవం

VSP: ప్రభుత్వ ఆదేశాల మేరకు 23న 'స్వచ్ఛాంధ్ర దినోత్సవం'లో భాగంగా పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ గురువారం అధికారులను ఆదేశించారు. ఆగస్టు థీమ్ "వర్షాకాలం పరిశుభ్రత" అని తెలిపారు. డెంగ్యూ, మలేరియా నివారణకు కాలువల శుభ్రపరిచడం, ఫాగింగ్, నీటి నాణ్యత పరీక్ష, టాయిలెట్ల పరిశుభ్రత, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.