VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

E.G: దేవరపల్లి మండలం దుద్దుకూరు జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజమండ్రి వైపు వెళ్తున్న ఐషర్ వ్యాన్ వెనుక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బంధాపురానికి చెందిన షేక్ ఇమామ్ (50) రోడ్డు డివైడర్‌ను తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనదారులు మృతదేహాన్ని 108లో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.