బావిలో విద్యార్థి మృతదేహం లభ్యం

బావిలో విద్యార్థి మృతదేహం లభ్యం

TPT: చంద్రగిరి మండలం కొత్తపేటలో స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లిన విద్యార్థి బషీర్ గల్లంతైన విషయం తెలిసిందే. పోలీసులు రంగంపేటకు చెందిన గజ ఈతగాళ్లు సాయంతో విద్యార్థి మృతదేహాన్ని సోమవారం వెలికితీశారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఎస్వీ మెడికల్ కాలేజ్‌కు తరలించారు. విద్యార్థి మృతితో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.