మహిళలు శక్తివంతమైతేనే దేశాభివృద్ధి: DSP
KDP: వేంపల్లిలో మహిళల భద్రతపై అవగాహన సదస్సును పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు శక్తివంతంగా ఉంటేనే దేశం అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో అపరిచితులను నమ్మవద్దని హెచ్చరించారు. వేధింపులు లేదా నేరాలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.