సుష్మా స్వరాజ్‌ భర్త కన్నుమూత

సుష్మా స్వరాజ్‌ భర్త కన్నుమూత

కేంద్ర మాజీమంత్రి సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కౌశల్ అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, బీజేపీ నేత బన్సూరీ స్వరాజ్ వెల్లడించారు.