బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

ఏలూరు FCI గోదాముల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బొంతు దుర్గాప్రసాద్‌, షేక్ అహ్మద్‌, చిట్టి ఆంజనేయులు వారి మృతదేహాలకు ఏలూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద ఎమ్మెల్యే రాధాకృష్ణా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా కల్పించడంతో పాటు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి రూ.10,000 అందజేశారు.