గంజాయి విక్రయిస్తున్న ఆటో డ్రైవర్ అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ఆటో డ్రైవర్ అరెస్ట్

HYD: గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని మేడ్చల్ SOT, బాలానగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో కలిసి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నిందితుడి నుంచి 100 గ్రాముల (22 ప్యాకెట్లు) గంజాయి, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి సనతనగర్ ఎస్ఆర్టీ నివాసి కట్ట నరేశ్(27) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. తేలికగా డబ్బు సంపాదించేందుకు గంజాయి దందా మొదలు పెట్టాడని గుర్తించారు.