'విద్యార్థి ఉద్యమాల అణచివేతకు చీకటి జీవోలు'

TPT: కూటమి ప్రభుత్వం విద్యార్థి సంఘాలకు విద్యా సంస్థల్లో ప్రవేశం లేకుండా చీకటి జీవోలు జారీ చేసిందని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఈనెల 18న జిల్లాలోని అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.