అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

CTR: అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం గూడూరు ఒకటో పట్టణం 14వ వార్డు పరిధిలోని నరజలమ్మ వీధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4000 రూపాయల పింఛన్లను అందిస్తోంది అన్నారు.