బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం

బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం

KKD: బాల్యవివాహాలు చేసిన ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని బాలల సంరక్షణ కౌన్సిలర్ దుర్గారాణి తెలిపారు. పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో బాల్య వివాహాల వల్ల జరిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మాయిలకు 18 సంవత్సరాలు అబ్బాయిలకు 21 సంవత్సరాలు దాటిన తర్వాతే వివాహం చేయాలని దుర్గారాణి సూచించారు.