సింగరేణి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత
HYD: సింగరేణి కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సింగరేణి కార్యాలయం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ కోసం సింగరేణి ధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ తీరుపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.