భారత్ విదేశాంగ శాఖ కీలక ప్రకటన
ఇరాన్ నౌకపై దాడికి భారత పోర్టును ఉపయోగించినట్లు అమెరికా మాజీ కల్నల్ డగ్లస్ మెక్‌గ్రెగర్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమైన ప్రచారమని 'X' వేదికగా స్పష్టం చేసింది. ఇలాంటి అవాస్తవాలను నమ్మవద్దని, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్న ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కేంద్రం తేల్చి చెప్పింది.