రెవెన్యూ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

రెవెన్యూ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

VZM: కొత్తవలస మండల తహసీల్దార్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇంఛార్జ్ తహసీల్దార్ సునీత జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ప్రాంగణంలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి చేసిన త్యాగాలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.