చాపమ్మ దేవి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు
KRNL: ఆదోని మండలం నెట్టేకల్లు సమీపంలోని శ్రీ చాపమ్మ దేవి ఆలయంలో అమావాస్య సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో నియోజవర్గ ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ ఛైర్మన్ కామాక్షి తిమ్మప్పతో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.