జిల్లాలో ఫిజియోథెరపీ ఆరోగ్య కేంద్రం ప్రారంభం

NLR: చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో ఇవాళ తన్విక ఫిజియోథెరపీ ఆరోగ్య కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని కలువాయి వైద్యురాలు డాక్టర్ సరళ కుమారి (ఎంబీబీఎస్) ప్రారంభించారు. ఈ సందర్భంగా సరళ కుమారి మాట్లాడుతూ.. వైద్యులు, నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరైనందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు ఏ సమస్య ఉన్న ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు.