రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులోని వెంకటాపురంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ద్విచక్రవాహన దారుడు లారీని తప్పించబోయి కిందపడ్డాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు అతడిని 108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.