కేశానుపల్లి పంచాయతీకి ట్రాక్టర్ బహూకరణ
PLD: నరసరావుపేట మండలం కేశానుపల్లికి చెందిన దాతలు బుధవారం రూ. 9 లక్షల విలువైన ట్రాక్టర్‌ను గ్రామ పంచాయతీకి బహుకరించారు. గ్రామంలో చెత్త సేకరణ కోసం ఈ 'స్వచ్ఛ రథం' వినియోగంలోకి వచ్చింది. గ్రామ అభివృద్ధిని కాంక్షించి, పారిశుద్ధ్య నిర్వహణకు తోడ్పాటునందించిన దాతలను గ్రామస్థులు సాదరంగా అభినందించారు.